Lavanya Tripathi | టాలీవుడ్ భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి (Sathi Leelavathi).తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్.. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మార్చి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శకనిర్మాతల సపోర్ట్ వల్లే షూటింగ్ చేయగలిగాను. సప్తగిరితో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో దేవ్ మోహన్ నటన అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఎంటర్టైనింగ్గా సాగే చిత్రం సతీలీలావతి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. మార్చి 6న సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానంది లావణ్య త్రిపాఠి.
కమల్ హాసన్ నటించిన సతీ లీలావతితో నా సినిమాను పోల్చనని డైరెక్టర్ తాతినేని సత్య అన్నాడు. అందరూ రిలేట్ అయ్యేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా తీశామని.. మార్చి 6న మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు. సతీలీలావతి చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్ టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Rajpal Yadav | రాజ్‌పాల్ యాదవ్‌కు లభించని ఊరట.. బెయిల్‌పై విచారణ వాయిదా