Mansion House | టాలీవుడ్లో ప్రస్తుతం రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే కోవలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే.. ‘శంకరమ్మ టెంట్ హౌస్’ నడుపుకుంటున్న కథానాయకుడు (శ్రీనాథ్ మాగంటి) పెళ్లి జరుగగా.. శోభనం రోజు రాత్రి పెళ్లి కూతురు సడన్ షాక్ ఇస్తుంది. మరి పెళ్లి కూతురు ఇచ్చిన షాక్ ఏంటి. ఈ షాక్ తిన్న మన హీరో ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రం మార్చి 06 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈచిత్రంలో శ్రీనాథ్ మాగంటితో పాటు, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మురళీధర్ గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమ్మ ముత్తు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎడిటింగ్ బాధ్యతలను గ్యారీ బి.హెచ్ నిర్వహించారు.