T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న అఫ్గనిస్థాన్‌కు మరో షాక్. బుధవారం దక్షిణాఫ్రికా చేతిలో దురదృష్టవశాత్తూ రెండో సూపర్ ఓవర్లో కంగుతిన్న కాబూలీ టీమ్‌ను మరింత బాధకు గురి చేస్తూ.. మొహమ్మద్ నబీ (Mohammad Nabi)కి ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ సీనియర్ ఆల్‌రౌండర్ మ్యాచ్ ఫీజులో పెద్ద మొత్తాన్నే కోల్పోనున్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలిన మ్యాచ్‌లో నబీ అంపైర్ నిర్ణయం పట్ల నిరసన తెలిపడమే అందుకు కారణం.
అసలే వరుస ఓటములతో డీలా పడిన అఫ్గనిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వెళ్లగక్కినందుకు మొహమ్మద్ నబీపై జరిమానా విధించింది. బుధవారం సఫారీలతో మ్యాచ్ 14వ ఓవర్లో అంపైర్‌తో నబీ తీవ్రంగా గొడవ పడడ్డాడు. పేసర్ ఎంగిడి చేతి బ్యాండ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ సీనియర్ ఆల్‌రౌండర్ మీరు అతడిని ఎలా అనుమితించారు అంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
A heated argument between Mohammad Nabi and the umpire, as Nabi was unable to sight the ball because of Lungi Ngidi’s hand bands.
📸: Jio Hotstar pic.twitter.com/vG1vpMu9Mq
— CricTracker (@Cricketracker) February 11, 2026
నబీ తీరుపై రిఫరీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయగా.. అతడు లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు గుర్తించారు. ఇదే విషయం అఫ్గన్ స్టార్ తన పొరపాటును అంగీకరించాడు. నబీ సారీతో సంతృప్తి చెందిన రిఫరీ ప్యానెల్ అధ్యక్షుడు డేవిడ్ గిల్బర్ట్ .. నబీకి మ్యాచ్ పీజులో 15 శాతం కోత విధించారు. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.
గత సీజన్లో సెమీఫైనల్ ఆడిన అఫ్గనిస్థాన్ ఈసారి బోణీ కొట్టలేకపోయింది. తొలిపోరులో న్యూజిలాండ్ ధాటికి కంగుతిన్న కాబూలీ టీమ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికాను వణికించింది. 187 పరుగుల ఛేదనలో రహ్మనుల్లా గుర్జాజ్(౦) మెరుపులతో స్కోర్ సమం చేసింది. అనంతరం సూపర్ ఓవర్లోనూ ఇరుజట్లు సమంగా నిలువగా.. రెండో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలింది. గుర్జాబ్ వరుసగా మూడు సిక్సర్లతో జట్టును గెలిపించినంత పనిచేశాడు. కానీ, చివరి బంతికి అడు ఔటవ్వగా.. అఫ్గనిస్థాన్ ఓటమిపాలైంది. రెండు ఓటములతో రషీద్ ఖాన్ బృందం సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
24 needed off 4 in the Super Over.
Rahmanullah Gurbaz goes 6, 6, 6… and then falls on the final ball as South Africa escape with the win.
Absolute heartbreak for Gurbaz, but what a fearless effort under pressure. 💔#SAvsAFGpic.twitter.com/IqX0IC48JN
— SKH (@Skh9864) February 11, 2026