Pixel 10a : గూగుల్ సంస్థ నుంచి వచ్చే పిక్సెల్ ఫోన్లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి మోస్ట్ అవైటెడ్ అయిన పిక్సెల్ 10ఏ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ నెలలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 18 నుంచి ప్రీ బుకింగ్స్ మొదలుకానున్నాయి. అయితే, ఇంకా విడుదల తేదీ వెల్లడి కాలేదు.
దీనికంటే ముందు వెర్షన్ అయిన పిక్సెల్ 9ఏ గత ఏడాది మార్చిలో విడుదలైంది. పిక్సెల్ 10ఏను పర్ఫామెన్స్ పరంగా బూస్టెడ్ వెర్షన్‌గా చెబుతున్నారు. ఇక.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పిక్సెల్ 10ఏకు సంబంధించిన ఫీచర్లు ఇవి. ఈ ఫోన్లో 6.3 అంగుళాల 120 హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 8జీబీ+128జీబీ/256జీబీ స్టోరేజ్, 48 ఎంపీ మెయిన్ సెన్సర్ కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, కటౌట్ ఆన్ ద డిస్ప్లే, 2,000 నిట్స్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ వంటి ఫీచర్లున్నాయి.
ఇది నాలుగు రంగుల్లో విడుదలవుతుంది. అవి ఒబ్సిడియన్, ఫాగ్, లావెండర్, బెర్రీ రంగుల్లో లభిస్తాయి. తాజా అంచనాల ప్రకారం వీటి ధరలు రూ.49,999, రూ.59,999గా ఉండే అవకాశం ఉంది.