నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్తంగా గురువారం జరిగిన కార్మికుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఐసి బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసిఈయు) ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బ్రాంచ్ లలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకుడు నలపరాజు సైదులు, ఐసిఈయు సికింద్రాబాద్ బేస్ యూనిట్ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ గడ్డం నవీన్ దాస్ సమ్మెకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపును ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బలపరుస్తూ సమ్మెలో పాల్గొనడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజల ఆశలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతిం చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని, ఎల్..ఐ.సి.లో క్లాస్ 3, క్లాస్ 4 నియామకాలను తక్షణమే చేపట్టాలని, ఎల్ఐసిలో 01.04.2010 తర్వాత చేరినటు వంటి ఉద్యోగులందరికీ కూడా నూతన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారని, దానిని రద్దుచేసి 1995 గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 1996 నోటిఫికేషన్ ద్వారా ఎల్ఐసి లో చేరిన ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ 57 అనుసరించి వారందరికీ 1995 గ్యారెంటీ పెన్షన్ వర్తింపజేయాలన్నారు. అదేవిధంగా ఏఐఐఈఏకు గుర్తింపుని ఇవ్వాలని, ఎల్.ఐ.సి. యాజమాన్యం యూనియన్లతో క్రమబద్ధంగా చర్చలు జరపాలన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలన్నారు. ఐడిబిఐ బ్యాంకును ప్రైవేట్ పరం చేయాలని చూడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎల్ఐసి ని బలహీన పరచాలని చూస్తున్న అన్ని విషయాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని వివరించారు. సమ్మెకు ఎల్ఐసి ఏజెంట్ల సంఘం, ఏఒఐ, లియాఫీ, క్లాస్ 1, 2 ఆఫీసర్స్ హర్షవర్ధన్, గురుమూర్తి, వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా బ్రాంచ్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఏ.కరుణాకర్ రావు, ఐతగోని లక్ష్మీనారాయణ, రమేష్, ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ మల్లేశం, సహాయ కార్యదర్శులు వింజమూరి వెంకటేశం, లెల్లెల శ్రీనివాసులు, కోశాధికారి జిన్నా శ్రీనివాస్ రెడ్డి, ఐసిఈయు నాయకులు ఎరుకల యాదగిరి, క్రాంతికుమార్, ఏ.యాదగిరి, కర్నాటి సత్యనారాయణ, పల్లపు లింగయ్య, యస్.సందీప్, యస్.యాదగిరి, డి.అంజయ్య, ఎం రామకృష్ణ, కే.వెంకటేశం, ఎల్.రామ కృష్ణ, బి.సుధాకర్, లక్ష్మయ్య, అఫ్సర్ ఖాన్, పరాంకుశం గోపికృష్ణ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓఐ బ్రాంచ్ 1 అధ్యక్ష, కార్యదర్శులు దారం వెంకన్న, సుంకి దేవేందర్, లియాఫీ నాయకులు ఈదులకంటి యాదయ్య, రావుల వీరయ్య, ఏజెంట్ల నాయకులు ధనుంజయరావు, శివశంకర్, బోగరి వెంకన్న, అంకూరి పృథ్వీరాజ్ లతో పాటు విశ్రాంత ఉద్యోగులు వేముల కృష్ణయ్య, స్వామి, ఏజెంట్ల సమాఖ్య ఏఓఐ డివిజన్ అధ్యక్షులు నలవరాజు సైదులు, దారం వెంకన్న, సంగెం వెంకటేశ్వర్లు, ఎన్. మహేశ్వరి, సుంకి దేవేందర్ సంఘీభావం ప్రకటించారు.