SpiderMan Brand New Day | హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (SpiderManBrandNewDay) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటివరకు ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (రూ.53.10 కోట్లు) పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్‌ను ఈ సినిమా అధిగమించింది. ఇండియాలో మరే హాలీవుడ్ సినిమా సాధించని విధంగా తొలి రోజు ఏకంగా రూ. 61 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆల్ టైమ్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్లలో కలిపి 5,000 పైచిలుకు స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాగా.. హాలీవుడ్ చరిత్రలోనే ఇది ఇండియాలో అత్యంత భారీ విడుదల కావడం విశేషం. అలాగే స్పైడర్-మ్యాన్ సిరీస్‌లో ఇదే అత్యధిక మొదటి రోజు వసూళ్లు కాగా, ‘సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై వచ్చిన చిత్రాల్లో ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, లాంగ్ వీకెండ్ ముగిసేసరికి సుమారు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.