తిరుమల : దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ( Tirumala laddu ) కల్తీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న వేళ సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ( CPI Narayana ) గురువారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి జరిగిన విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
తిరుపతి లడ్డూలో ( Tirumala Laddu ) కల్తీ జరిగిందనేది వాస్తవమే అయినప్పటికీ, రాజకీయ నాయకులు ఈ అంశంపై రాజకీయం చేయడం మానేసి, దానికి సంబంధించిన దోషులకు కఠినమైన శిక్ష విధించాలని సూచించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు లడ్డూ సమస్యను రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుంటూ భక్తులకు మానసిక వేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇరు పార్టీల నాయకులు నోరును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బాధ్యతా యుతమైన అధికారులు , మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై చర్య తీసుకోవాలని, దానిని రాజకీయ వైరంగా మార్చవద్దని తెలిపారు. పవిత్రమైన లడ్డూలను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ వాస్తవమేనని పేర్కొన్నారు.