బహదూర్‌గూడ భూముల్లో స్టేటస్కో..హైకోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం లేదా అధికారులు ఏవైనా చర్యలు చేపట్టాలనుకుంటే తప్పనిసరిగా చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టంచేసింది.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం లేదా అధికారులు ఏవైనా చర్యలు చేపట్టాలనుకుంటే తప్పనిసరిగా చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టంచేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేసే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. కేసు విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బహదూర్‌గూడ గ్రామానికి చెందిన ఆర్ కృష్ణమోహన్రాజుతోపాటు మరో 84 మంది రైతులు ఒక పిటిషన్, ముస్తాంగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ బలగాలతో వచ్చి ఇండ్లను కూల్చివేసి, రైతులు, మహిళలను బలవంతంగా ఖాళీ చేయించారని, తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి ఇప్పటికే ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని, తమ ప్రాథమిక హకులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది హనుమంతరావు వాదనలు వినిపిస్తూ, కూల్చివేసిన నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలని, ఒకో రైతుకు రూ.2 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
తెల్లవారుజామున మహిళలపై, రైతులపై విచక్షణారహితంగా దాడులు చేసి ఖాళీ చేయించారని పేరొంటూ మొత్తం ఘటనపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ భూములు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 650 ఎకరాలలో భాగమని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి భూముల యాజమాన్య హకులకు సంబంధించిన తీవ్ర వివాదాస్పద అంశాలు ఉన్నాయని పేరొన్నారు. పిటిషనర్ల హకుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ప్రస్తుతమున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

