తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కనిపిస్తలేవా చామల?
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు గురవింద గింజ తీరుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాత్రం సడి సప్పుడు చేయడంలేదు.
- ముందు దీని గురించి మాట్లాడు
- కాంగ్రెస్ ఎంపీ ద్వంద్వ వైఖరిని నిలదీసిన ప్రజలు
హైదరాబాద్, జులై 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు గురవింద గింజ తీరుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాత్రం సడి సప్పుడు చేయడంలేదు. పార్టీ ఫిరాయింపులపై లోక్‌సభలో చర్చించాలని, ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం అంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఎగదోసి టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ) పార్టీల ఎంపీలు పార్టీ మారేటట్టు చేస్తున్నదని ఆరోపించారు.
ఇది ప్రమాదకరస్థాయికి చేరిందని, కాబట్టి సభలోని ఇతర అంశాలను పక్కనపెట్టి ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఎంపీల ఫిరాయింపులపై ఇంతలా ఆందోళన చెందుతున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులు కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 9 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇది పార్టీ ఫిరాయింపు కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే తప్పు.. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ఒప్పా అని నిలదీస్తున్నారు. ముందు తెలంగాణలో కాంగ్రెస్ తీరును ఖండించి తర్వాత ఢిల్లీలో ఎంపీల ఫిరాయింపులను ప్రశ్నించాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

