ఈ రోజుల్లో ప్రతిదీ ఫోన్లో ఉన్నా, ఇష్టమైన పాటలు రేడియోలో వింటూ ఆ మెలోడీలో మునిగిపోవడమే వేరు. కానీ, పెద్దపెద్ద రేడియోలను వెంట తీసుకెళ్లడం కష్టం. అలాగే ఫోన్లో రేడియో వినాలంటే డేటా లేదా బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టి, మీరు ఎక్కడికి వెళ్లినా రేడియో స్టేషన్లను వెంట తీసుకెళ్లేలా Cason డిజిటల్ పాకెట్ మినీ రేడియో వచ్చేసింది. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే, మీ అరచేతిలో ఇమిడిపోతుంది. కేవలం 45 గ్రాముల బరువు ఉండే ఈ బుజ్జి రేడియోను మీ బెల్ట్‌కు లేదా జేబుకు తగిలించుకోవచ్చు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు హాయిగా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇందులో ఎక్స్టర్నల్ స్పీకర్ ఉండదు, దీనికి ఇచ్చే ఇయర్ఫోన్స్తోనే పాటలు వినాలి. యూఎస్బీ-సీ కేబుల్‌తో ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, ఏకంగా 14 గంటల పాటు నిరంతరంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎల్సీడీ స్క్రీన్ వల్ల చీకటిలో కూడా స్టేషన్లను చూసుకోవడం చాలా సులభం. ఆటోమేటిక్ స్టేషన్ సెర్చ్ ఫీచర్ ఉండటం వల్ల చానెళ్లను వెతుక్కోవాల్సిన పని లేకుండా, అవే సేవ్ అవుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సులభంగా వాడగలిగేలా రూపొందించారు. ఇది ప్రయాణాల్లో ఓ మంచి నేస్తంలా తోడుంటుంది.
ధర: రూ. 1,199
దొరుకు చోటు: అమెజాన్
వైర్లు అందక ఇబ్బందా?

పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా కలర్ లైట్లు వేయాలని ఉంటుంది. కానీ, ఆ లైట్ల వైర్లు మనం అనుకున్న చోటుదాకా అందవు. ఇక గార్డెన్లో ఏదైనా ఎలక్ట్రిక్ పరికరం వాడాలన్నా, ల్యాప్‌టాప్ చార్జర్ సాకెట్‌కు దూరంగా ఉన్నా చాలా ఇబ్బంది పడతాం. ఇలాంటి చిన్నచిన్న కరెంటు కష్టాలను దూరం చేసేలా Klick Gadgets వారి 2 పిన్ అండ్ 3 పిన్ త్రెడెడ్ ఎక్స్టెన్షన్ వైర్ వచ్చేసింది. ఇది సాదాసీదా వైరు లాంటిది కాదు. దీనికి ఒకవైపు ప్లగ్ (Male port), మరోవైపు సాకెట్ (Female port) ఉంటాయి. దీనివల్ల మీ దగ్గర ఉన్న ఏ ఎలక్ట్రిక్ వస్తువు వైరునైనా దీనికి కనెక్ట్ చేసి, మరో రెండున్నర మీటర్ల దూరం వరకు పొడిగించుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ వైరును ఇటు ఇంటి లోపల, అటు గార్డెన్ లేదా టెర్రస్ వంటి ఆరుబయట ప్రదేశాల్లో కూడా ధైర్యంగా వాడుకోవచ్చు. ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండటమే కాకుండా, ఎక్కువ కాలం మన్నేలా దృఢంగా తయారైంది. అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ వైర్లను ఒకదానికొకటి జోడించి ఎంత దూరమైనా పెంచుకోవచ్చు. పండుగ వెలుగులకైనా, ఇంటి పనులకైనా తప్పకుండా ఉండాల్సిన గ్యాడ్జెట్ ఇది.
ధర: రూ. 236
దొరుకు చోటు:అమెజాన్
మల్టీ పర్పస్ మ్యాజిక్!

ఒక్కోసారి చిన్న సమస్య వచ్చినా పెద్ద ఇబ్బందే అవుతుంది. దారిలో కారు ఆగినా.. చీకటిలో తాళాలు వెతుక్కోవాల్సి వచ్చినా.. లేదంటే ఏదైనా బాటిల్ మూత తీయాలన్నా.. సరైన వస్తువు అందుబాటులో లేకపోతే చిరాకు వస్తుంది. అలాగని.. వీటన్నిటికీ విడివిడిగా వస్తువుల్ని జేబులో వేసుకోలేం కదా! అందుకే, చిన్న కీచైన్ పరిమాణంలోనే ఇన్ని అవసరాలనూ తీర్చేలా KLIFFOO కీచైన్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ వచ్చేసింది. ఇది టార్చ్ లైట్ మాత్రమే కాదు, ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 7 రకాల లైట్ మోడ్స్ ఉన్నాయి. తెల్లటి కాంతి నుంచి ఎర్రటి వెలుగు వరకు మన అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇందులోని
‘రెడ్‌లైట్ స్ట్రోబ్’ భలేగా ఉపయోగపడుతుంది. ఇందులో స్క్రూ డ్రైవర్లు, బాటిల్ ఓపెనర్, విజిల్తోపాటు సిగరెట్ లైటర్ ఫంక్షన్ కూడా ఉంది. క్యాంపింగ్‌కు వెళ్లే వారికి నిప్పు రాజేయడానికి ఇది చాలా సహాయపడుతుంది.
ధర: రూ. 599
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
కెమెరాపై ఫోన్.. షూటింగ్లో మీరే కింగ్!

ప్రొఫెషనల్ కెమెరాతో ఫొటోలు తీస్తూ.. అదే సమయంలో ఫోన్లో వీడియోలు తీసుకోవాలన్నా.. సోషల్ మీడియా కోసం రీల్స్ చేయాలన్నా రెండు చేతులతో మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒక చేత్తో భారీ కెమెరా, మరో చేత్తో ఫోన్ పట్టుకోవడం సాధ్యం కాదు కదా! ఈ ఇబ్బందిని దూరం చేస్తూ.. మీ కెమెరానే ఒక స్మార్ట్ స్టాండ్‌లా మార్చేసే చిన్న పరికరం ఒకటుంది. అదే Yantralay 1/4 ఫ్లాష్ హాట్షూ అడాప్టర్. ఇది డీఎస్ఎల్ఆర్ కెమెరా పైన ఉండే ఫ్లాష్ స్లాట్‌కు సులభంగా అమరిపోతుంది. దీనికిపైన ఉండే స్క్రూ సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా బిగించొచ్చు. దీంతో కెమెరాతో ఫొటోలు క్లిక్ మనిపిస్తూనే, పైన ఉన్న ఫోన్‌తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వ్లాగర్లు, ఫొటోగ్రాఫర్లు, ట్రావెలర్లులకు ఇదో అద్భుతమైన తోడు. షూటింగ్ సమయంలో ఫోన్‌తో వీడియోలు షూట్ చేయడానికి ఈ చిన్న గ్యాడ్జెట్ జేబులో ఉండాల్సిందే. తక్కువ ధరలో మీ ఫొటోగ్రఫీ స్కిల్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లడానికి ఇదో చక్కని మార్గం.
ధర: రూ. 299
దొరుకు చోటు: అమెజాన్