కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, ఏప్రిల్ 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పదోతరగతి చదువుతున్న అంజన్న, శశికుమా ర్, నవదీప్, జాన్సన్, తొమ్మిదోతరగతి విద్యార్థి సురేశ్, ఏడోతరగతి విద్యార్థి స మ్మయ్య, బయో సైన్స్ ఉపాధ్యాయుడు బాలాజీ గురువారం సాయంత్రం భోజ నం చేశారు. మిగిలిన భోజనాన్ని ప్లేట్లలోనే ఉంచుకొని తిరిగి రాత్రి 11 గంటల కు తిన్నారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న విద్యార్థులు, ఉదయం టిఫి న్ చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఉపాధ్యాయుడితోపాటు వి ద్యార్థులను వెంటనే కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వీరందరి ఆరో గ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాల విషయంలో పాఠశాల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.