హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలి ‘క్వేక్ ఎరీనా’ పబ్‌పై ఈగల్ ఫోర్స్ చేసిన మెరుపు దాడిలో ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ మహిళా ఐఏఎస్ కుమారుడు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో అంతర్జాతీయ డీజే ‘బ్లాక్ కాఫీ’ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పకా సమాచారంతో గురువారం (ఈనెల 2న) అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర టాస్‌ఫోర్స్, ఈగల్‌ఫోర్స్, సైబరాబాద్ నారోటిక్స్ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు.
ఈ పార్టీకి హాజరైన వారిలో డ్రగ్స్ సేవించారనే అనుమానం ఉన్న 64 మందిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పార్టీకి ఎటువంటి అంతరాయం కలుగకుండానే, అనుమానితులకు అత్యాధునిక ఏబీవోఎన్ఎన్ యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. మొదటి విడతలో ఐదుగురిని పరీక్షించగా, నలుగురికి గంజాయి, బెంజోడియాజిపైన్ పాజిటివ్ అని తేలింది. తదుపరి పరీక్షల్లో మరో ముగ్గురు గంజాయి, మెథామెఫ్టమైన్ సేవించినట్టు నిర్ధారణ అయ్యింది. మొత్తం ఏడుగురు డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. పబ్ డీజేలకు నెగటివ్ అని తేలింది. పట్టుబడిన వారు తమ తప్పును అంగీకరించగా.. వీరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 591/2026 కింద ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ) ఆర్/డబ్ల్యూ 27(ఏ), 27(బీ) కింద కేసు నమోదు చేశారు.
నాకు నెగిటివ్ వచ్చింది: నటి హేమ
క్వేక్ ఎరినా పబ్‌లో జరిగిన పార్టీకి తాను కూడా వెళ్లానని సినీ నటి హేమ తెలిపారు. అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానించిన వారిలో ఆమె కూడా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. యూరిన్ టెస్ట్‌లో తనకు నెగిటివ్ వచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్లలో హేమ పోస్టు చేశారు. ‘ఆ పార్టీకి వెళ్లిన వారిలో నేనూ ఉన్నాను. పోలీసులు అనుమానంతో నా యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. నెగిటివ్ వచ్చింది’ అని పేర్కొన్నారు.