KTR | హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలోకేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా.. పార్టీ వెన్నెముక కార్యకర్తలేనన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా మనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది ‘పూజకు పనికిరాని పువ్వు’ అని ఎద్దేవా చేశారు. ‘వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి’ అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు.
నగరంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్బీఐ బ్రాంచ్‌లో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
డివిజన్ల వారీగా సమావేశాలు..
త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు కేటీఆర్. ఎమ్మెల్యే లేడని భయపడకండి, మీకు అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి, కృష్ణారావు ఉంటాం. ఏ అవసరమొచ్చినా మేము అందుబాటులో ఉంటాం” అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. ముఖ్యంగా మహిళా లోకానికి కేటీఆర్ విన్నవించారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు , నేతలు పాల్గొన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్ళిపోయినా..
కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారు.బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు.
అందుకే కార్పొరేషన్లు ఎన్నైనా..
హైదరాబాద్ మహా నగరంలో ఎగిరేది గులాబీ జెండానే.– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/qD8w5CB0s3
— BRS Party (@BRSparty) February 12, 2026
BRS | రాజేంద్ర నగర్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన
Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ