ఛత్రపతి శంభాజీ నగర్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సమావేశం కానున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో ఈ భేటీ జరుగనున్నట్టు ఆ పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం పార్టీ ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించనుంది. భవిష్యత్ కార్యాచరణపై తీసుకునే తుది నిర్ణయాలను అప్పుడే అధికారికంగా ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తాజాగా అభిజీత్ దీప్కే తన నివాసంలో విద్యార్థులు, స్థానికులు, సందర్శకులను కలుసుకుని ఫ్రెండ్షిప్ డే వేడుకలు చేసుకున్నారు.