Hair Fall In Winter | చలికాలంలో మహిళల్లో అధికంగా జుట్టు రాలడం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే..!
జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ శీతాకాలంలో ఈ జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా.. అవును శీతాకాలంలో మహిళల్లో జుట్టు రాలడం సాధారణం కంటే మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
Hair Fall In Winter | జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ శీతాకాలంలో ఈ జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా.. అవును శీతాకాలంలో మహిళల్లో జుట్టు రాలడం సాధారణం కంటే మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులతో పాటు జీవనశైలిలో వచ్చే మార్పుల కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఇది తల చర్మాన్ని పొడిగా మారుస్తుంది. దీంతో చర్మం బిగుతుగా, దురదగా అనిపిస్తుంది. తలచర్మం అనారోగ్యంగా ఉండడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా తయారవుతాయి. దీని వల్ల జుట్టు విరిగిపోవడం, జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది.
రక్త ప్రసరణ ప్రభావం..
అంతేకాకుండా చలికాలంలో రక్తప్రసరణ కూడా ప్రభావితం అవుతుంది. శరీరం ఇతర అవయవాలను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. దీంతో తలకు రక్తప్రసరణ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు రక్తం, ఆక్సిజన్, పోషకాల ప్రసరణ తగ్గడం వల్ల జుట్టు బలహీనంగా మారడంతో పాటు జుట్టు పెరుగుదల కూడా మందగిస్తుంది. వీటితో చలికాలంలో మనం అనుసరించే కొన్ని పద్దతుల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. చలికాలంలో సహజంగానే మనం వేడి నీటితో స్నానం చేస్తాం. తలస్నానం వేడి నీటితో చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. అలాగే జుట్టును తరచుగా బ్లో డ్రై చేయడం వల్ల జుట్టు పొడిబారుతుంది. జుట్టు పొడిబారడం వల్ల జుట్టు ఎక్కువగా విరిగిపోతుంది.
నీటిని తక్కువగా తాగడం..
అదే విధంగా చలికాలంలో చాలా మంది నీటిని తక్కువగా తాగుతారు. దీంతో శరీరం నిర్జలీకరణానికి గురి అవుతుంది. ఇది జుట్టు బలాన్ని, మెరుపును తగ్గిస్తుంది. జుట్టు రాలడం అనేది కాలానుగుణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వేసవి ముగిసిన కొన్ని నెలల తరువాత జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా చలికాలంలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. పొడి వాతావరణం, బలహీనమైన కుదుళ్లు, కాలం మారడం వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా చలికాలంలో కొందరు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కు గురి అవుతారు. దీంతో ఒత్తిడి పెరిగి జుట్టు ఎక్కువగా రాలుతుంది.
హార్మోన్ మార్పులు..
అంతేకాకుండా మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు, థైరాయిడ్ సమస్య, పీసీవోఎస్ వంటి సమస్యలతో బాధపడే వారిలో జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టును ఎక్కువగా కడగడం, కఠినమైన షాంపూలు వాడడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇలా అనేక కారణాల వల్ల చలికాలంలో మహిళల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలడం తాత్కాలికమే అయినప్పటికీ తల చర్మాన్ని సంరక్షించుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల చలికాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

