Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటో షేర్లు లాస్
Flipkart | వాల్మార్ట్ (Walmart) కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ (E-commerce) సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. ఫుడ్ డెలివరీ (Food Delivery) విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది.
Flipkart : వాల్మార్ట్ (Walmart) కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ (E-commerce) సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. ఫుడ్ డెలివరీ (Food Delivery) విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నదన్న వార్తల నేపథ్యంలో.. ఇప్పటికే ఈ రంగంలో హవా నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం నష్టపోయాయి.
కాగా, ఈ ఏడాది మే-జూన్ నెలల మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు ఫ్లిప్కార్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి గానీ, వచ్చే ఏడాదికల్లా గానీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. స్విగ్గీ, జొమాటో తరహాలో స్టాండ్ అలోన్ ప్లాట్ఫామ్ను నెలకొల్పాలా..? లేదా ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఓఎన్డీసీలో బయ్యర్ సైడ్ అప్లికేషన్ను ఏర్పాటు చేయాలా..? అనే ఆప్షన్లను ప్రస్తుతం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఫ్లిప్కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ, జొమాటోల హవా కొనసాగుతున్నది. ఈ రంగంలోకి రావడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నించినా అవేవీ పెద్దగా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో వాల్మార్ట్ లాంటి పెద్ద సంస్థ అండ ఉన్న ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించబోతోందన్న వార్తలు.. స్విగ్గీ, జొమాటోల షేర్లపై ప్రభావం చూపాయి. జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ షేరు విలువ 2 శాతం మేర పతనమై రూ.291.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుంది.
స్విగ్గీ షేర్ విలువ కూడా ఓ దశలో 3 శాతానికి పైగా నష్టంతో రూ.328 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కొద్దిగా పుంజుకుంది. గతంలో క్యాబ్ సర్వీస్ సంస్థ ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెడుతోందన్న వార్తలు రావడంతో.. స్విగ్గీ, జొమాటోల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

