డిస్కౌంట్ ప్రయాణం
రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూడటం కన్నా.. టికెట్ కౌంటర్ దగ్గర క్యూలైన్లో నిరీక్షించడమే సహనానికి పరీక్ష పెడుతుంది. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూడటం కన్నా.. టికెట్ కౌంటర్ దగ్గర క్యూలైన్లో నిరీక్షించడమే సహనానికి పరీక్ష పెడుతుంది. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అన్‌రిజర్వ్ టికెట్ల కోసం కౌంటర్ దగ్గర వేచి చూడకుండా మీ ఫోన్లోనే ‘రైల్‌వన్’ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, కౌంటర్ ధర కంటే 3 శాతం డిస్కౌంట్‌తో ప్రయాణించవచ్చు.
ఈ సరికొత్త పథకాన్ని జనవరి 14 నుంచి జూలై 14 వరకు నార్తర్న్ రైల్వే అమలు చేస్తున్నది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని జోన్లలోనూ సేవలు అందుబాటులోకి తేనున్నది. ప్లే స్టోర్ నుంచి రైల్‌వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. టికెట్ బుక్ చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ కార్డ్స్ ఎంచుకుంటే 3 శాతం డిస్కౌంట్ ఆటోమేటిక్‌గా మీ ఖాతాలో పడిపోతుంది. కౌంటర్ దగ్గర వేచి చూడకుండానే టికెట్ పొందొచ్చు. 3 శాతం డిస్కౌంట్ చిన్న మొత్తంగా అనిపించినా.. రెగ్యులర్‌గా రైలు ప్రయాణం చేసేవారికి ఇది మంచి ప్రయోజనమే అందిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

