తుది దశకు కాళేశ్వరం ఆలయ కూల్చివేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత ఆలయ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి.
- మరో రెండు రోజుల్లో పనులు పూర్తి
- నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం
కాళేశ్వరం, ఆగస్టు 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత ఆలయ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సరస్వతీ, పార్వతీదేవి, ఉప ఆలయాలు, రాజగోపురాల తొలగింపు పనులు పూర్తికాగా, ప్రస్తుతం స్వామివారి గర్భగుడిని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నది.మరో రెండు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
సంప్రదాయ ఆలయ శిల్పకళను ఆధునిక సౌకర్యాలతో మేళవించి నూతన ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 1973లో పునర్నిర్మించిన ఆలయ గర్భగుడి కాలక్రమేణా దెబ్బతినడంతో, ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయ సమగ్ర పునరుద్ధరణకు రూ.198 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాళేశ్వరాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

