George Krish | శ్రీనువైట్ల – శర్వానంద్ క్రేజీ ప్రాజెక్ట్ ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది!
George Krish | టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ అండ్ ఎంటర్టైనర్ల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'జార్జ్ క్రిష్' (George Krish).
George Krish | టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ అండ్ ఎంటర్టైనర్ల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘జార్జ్ క్రిష్’ (George Krish). ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ బూస్టర్’ పేరిట ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘జార్జ్’, ‘క్రిష్’ అనే పేర్లతో ఈ రోల్ చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ విపరీతంగా ఏర్పడింది. శ్రీనువైట్ల తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ టేకింగ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి నాయికగా నటిస్తుండగా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందిస్తున్న బాణీలు సినిమాకు అదనపు బలంగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ పండగ సీజన్‌కి సరిగ్గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘జార్జ్ క్రిష్’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

