Xi Jinping: భాగస్వామ్యులుగా ఉండాలి.. ప్రత్యర్థులుగా కాదు: జీ జిన్పింగ్
Xi Jinping: అమెరికా, చైనా దేశాలు భాగస్వామ్యులుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదు అని చైనా అద్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు. వాషింగ్టన్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అవుతూ.. కొత్త యుగంలో ఇద్దరం కలిసి ముందుకు వెళ్లే మార్గాలను అన్వేషించుకోవచ్చు అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: అమెరికా, చైనా దేశాలు భాగస్వామ్యులుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదు అని చైనా అద్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు. వాషింగ్టన్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన లిఖితపూర్వకంగా రియాక్ట్ అవుతూ.. కొత్త యుగంలో ఇద్దరం కలిసి ముందుకు వెళ్లే మార్గాలను అన్వేషించుకోవచ్చు అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చైనా ప్రజల తరపున ఆయన అమెరికా ప్రజలకు గ్రీటింగ్స్, బెస్ట్ విషెస్ తెలిపారు. చైనా, అమెరికా.. గొప్ప దేశాలు అని, ఈ దేశాల ప్రజలు కూడా గొప్పవారే అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రెండు దేశాలకు చెందిన ప్రజలు స్నేహపూర్వకంగా నడుచుకున్నట్లు చెప్పారు. రెండు దేశాల ప్రజల ఆసక్తి కూడా పెనవేసుకుని ఉన్నట్లు తెలిపారు.
చైనా, అమెరికా భాగస్వామ్యంతో కలిసి ఉండాలని, ప్రత్యర్థులుగా కాదు అని ఆయన అన్నారు. చైనాకు నూతనోత్సాహం, అమెరికాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ప్రపంచ క్షేమం కోసం రెండు దేశాలు ఒకరికి ఒకరు సాయం చేసుకుని, ముందుకు వెళ్లాలని అన్నారు. అమెరికా, చైనా అభివృద్ధికి ఈ సంవత్సరం చాలా కీలకమైందని జిన్పింగ్ అన్నారు. మే నెలలో చైనాలో ట్రంప్ పర్యటించిన సమయంలో నిర్మాణాత్మక, వ్యూహాత్మక బంధాన్ని ఏర్పర్చుకునేందుకు ట్రంప్ అంగీకరించినట్లు జిన్పింగ్ గుర్తు చేశారు. రెండు దేశాలు సహకారంతో తమ రిలేషన్ను బలోపేతం చేసుకోవాన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

