Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి వారం నుంచే టాస్కులు, గొడవలు, బాండింగ్స్, ఎమోషనల్ సన్నివేశాలతో హౌస్‌లో సందడి కనిపిస్తోంది. సాధారణంగా వైల్డ్ కార్డు ఎంట్రీలు కొన్ని వారాల తర్వాత ఉండటం చూస్తుంటాం. అయితే ఈసారి మాత్రం ముందుగానే వైల్డ్ కార్డు ఎంట్రీలతో షోలో మరో కొత్త ట్విస్ట్ ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు 10లోకి ఏకంగా ముగ్గురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురూ ఇప్పటికే ఈ సీజన్‌కు ముందు జరిగిన ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంలో పాల్గొన్నవారేనని సమాచారం. నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ పేర్లు ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీల విషయంలో వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురి వైల్డ్ కార్డు ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందనే ప్రచారం జరుగుతోంది. రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లినట్లు సమాచారం. దీంతో వీరి ఎంట్రీపై బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఈ ముగ్గురినీ నేరుగా హౌస్‌లోకి పంపుతారా? లేక వారికి ప్రత్యేకమైన టాస్కులు నిర్వహించి, ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా అపూర్వ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే షోలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ‘అగ్నిపరీక్ష’ సమయంలో అపూర్వ, రోహిత్ మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు అప్పట్లో చర్చ జరిగింది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రోహిత్, శాలిని మధ్య కూడా మంచి బాండింగ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అపూర్వ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టి రోహిత్‌తో మళ్లీ సన్నిహితంగా ఉంటే పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తిని రేపుతోంది. దీంతో వీరి ఎంట్రీ నిజమైతే హౌస్‌లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఒకసారి కాకుండా రెండు విడతల్లో ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ముగ్గురి పేర్లు నిజమైతే.. వీరితో బిగ్ బాస్ 10లో ఆట మరింత మారే అవకాశం ఉంది.అయితే రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ ముగ్గురూ నిజంగానే వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ప్రవేశిస్తారా? లేక వీరిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుందా? అనేది అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.