భద్రాచలం, ఆగస్టు 6 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చర్ల రోడ్డులో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పేరెంట్ తన కూతురును చూసేందుకు చర్ల గిరిజన గురుకుల కళాశాలకు వచ్చారు.
‘ఇక్కడ ఉండి చదవలేనని, నీతోనే వస్తాను’ అని ఆ విద్యార్థిని తండ్రికి చెప్పినా వినకుండా ఇక్కడే ఉండి చదుకోవాలని చెప్పి వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రిన్సిపాల్ ఆ విద్యార్థినిని భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.