ఉదయ్ ఫోన్లోనే కీలక ఆధారాలు
హైదరాబాద్‌లోని పోలీస్ అధికారుల శిక్షణ కేంద్రంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులపై నమోదైన సంచలన కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫొటోలు, చాటింగ్, మెసేజ్‌ల గురించి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.
- కొనసాగుతున్న పోలీస్ విచారణ
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అగస్టు 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని పోలీస్ అధికారుల శిక్షణ కేంద్రంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులపై నమోదైన సంచలన కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫొటోలు, చాటింగ్, మెసేజ్‌ల గురించి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. అతడు వాడిన ఓ మొబైల్ ఫోన్లోనే కీలకాధారాలు ఉన్నట్టు గుర్తించారు. నిందితుడు ఉపయోగించిన మరో ఫోన్‌ను ఎక్కడ దాచాడనే విషయంపై తీవ్రంగా శోధిస్తున్నారు.
ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు మేరకు ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల చట్టం ప్రకారం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ కస్టడీలో తొలిరోజైన గురువారం అత్తాపూర్ ఠాణాలో కీలకాంశాల గురించి ప్రశ్నించి జవాబులు రాబట్టేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారి లావణ్యనాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగింది.
మొదటి రోజు కస్టడీలో పూర్తిగా ఉదయ్ కృష్ణారెడ్డి వ్యక్తిగత విషయాలతో పాటు సివిల్స్‌కు సిద్ధమతున్న సమయంలో కోచింగ్ తీసుకున్న ప్రాంతాల గురించి ఆరా తీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన మహిళకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

