China’s Video : చైనాలో నిర్మాణాలు కొన్ని ఎంత గొప్పగా ఉంటాయో ఇంకొన్ని అంత నాసిరకంగా ఉంటాయి. పలు బ్రిడ్జిలు, బిల్డింగులు కూలిపోవడం, రోడ్లు కుంగిపోవడం వంటి ఘటనలు అక్కడ మామూలే. ఇక ఇటీవలి కాలంలో ప్రధాన నగరమైన షాంఘైలో రోడ్లు చాలా చోట్ల కుంగిపోతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ వీడియో విడుదలైంది.
ఒక రోడ్డు దాదాపు పది మీటర్ల లోతులోకి కుంగిపోయింది. అంతేకాదు.. రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు వంటి నిర్మాణాలు కూడా ఆ గోతిలో కూరుకుపోయాయి. ఈ దృశ్యం అంతా అక్కడి సెక్యూరిటీ కెమెరాలో రికార్డైంది. వీడియో చూస్తే అక్కడి నిర్మాణ రంగం ఎంత నాసిరకంగా ఉందో అర్థమవుతుంది. చాలా బిజీగా ఉండే పెద్ద రోడ్డు ఇలా గోతిలోపలికి కూరుకుపోయింది. ఈ ఘటన 2024 జనవరిలో జరగగా, తాజాగా వీడియో విడుదలైంది. ఒక మురికి నీటి పైప్ లైన్ ఫెయిల్యూర్ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్లు, ఇతర నిర్మాణాలు గోతుల్లో కూరుకుపోవడం (సింక్ హోల్స్) ఇటీవల ఎక్కువవుతున్నాయి. దీనిపై 2017-2023కు సంబంధించిన నివేదికను చైనా విడుదల చేసింది.
A massive sinkhole has opened up, swallowing a key section of roadway in Shanghai, China. pic.twitter.com/cHqpihXZzQ
— Open Source Intel (@Osint613) February 12, 2026
72 శాతం నిర్మాణాలు కుంగిపోవడానికి మానవ తప్పిదాలు, మానవ చర్యలే కారణమని తేల్చారు. నాసిరకం నిర్మాణాలు, నిర్వహణా లోపాలు, మట్టి బలంగా లేకపోవడం, పైపొరలు, ఇసుక బలహీనంగా ఉండటం, ఎక్కువ శాతం భూగర్భ జలాల్ని వాడటం, భూమి పొరల్లో ఖాళీలు ఉండటం వంటివి సింక్ హోల్స్‌కు కారణాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చాలని అధికారులు భావిస్తున్నారు.