Viral Video | బటర్ చికెన్ షూస్ ఎప్పుడైనా చూశారా.. కొత్తగా ట్రై చేసిన యువతి.. వద్దంటున్న నెటిజన్లు
Viral Video : బటర్ చికెన్ షూస్.. ఈ పేరు ఎప్పుడూ విని ఉండరు కదా. ఎందుకంటే ఒకటి ఫుడ్ అయితే.. ఇంకోటి ఒంటిపై ధరించే యాక్సెసరీ. రెండూ వేర్వేరు. అయితే, ఒక యువతి తన క్రియేటివిటీతో ఈ రెండింటినీ మిక్స్ చేసింది.
Viral Video : బటర్ చికెన్ షూస్.. ఈ పేరు ఎప్పుడూ విని ఉండరు కదా. ఎందుకంటే ఒకటి ఫుడ్ అయితే.. ఇంకోటి ఒంటిపై ధరించే యాక్సెసరీ. రెండూ వేర్వేరు. అయితే, ఒక యువతి తన క్రియేటివిటీతో ఈ రెండింటినీ మిక్స్ చేసింది. దీనికి సంబంధించి ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో జూలియట్ అనే యువతి షూస్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ బేస్ తయారు చేసింది.
ఇవి హీల్స్ లాగా షూస్ కింది భాగంలో ఉంటాయి. వీటిలో బటర్ చికెన్ నింపింది. తర్వాత ఈ సోల్‌ను పైనుంచి మూసేసింది. తర్వాత వాటిపై తిరిగి షూస్ ఫిక్స్ చేసింది. ఈ షూస్ కింద ఉన్న బేస్‌లోని బటర్ చికెన్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేసింది. అంతేకాదు.. తర్వాత ఆ షూస్ ధరించి బయట పార్క్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడ ఒక బెంచీపై కూర్చుని షూస్ తీసి, వాటి అడుగున ఉన్న బేస్‌లోని చికెన్‌ను స్పూన్‌తో తీసుకుని తిన్నది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అయితే, నెటిజన్లు మాత్రం దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. తినే ఫుడ్‌ను భారతీయులు అలా కాళ్ల కింద పెట్టుకోరు అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియో చూస్తే వాంతులొలస్తున్నాయని, ఈ క్రియేటివిటీ చండాలంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇక.. జూలియట్ అనే ఈ యువతి గతంలో కూడా ఇలాంటి కొన్ని విచిత్రమైన ఫుడ్ క్రియేటివిటీ వీడియోలు చేసింది. ఇంతకీ బటర్ చికెన్ షూస్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం’
‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

