IND vs NAM : పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో తేలిపోయిన భారత బ్యాటర్లు నమీబియాపై ఉతికేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్(61) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి ప్రత్యర్ధి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.. మెరుప అర్ధశతకంతో భారీస్కోర్‌కు పునాది వేసిన ఇషాన్ ఔట్‌కాగానే.. మిడిలార్డర్ అతడిని అనుసరించారు. అయితే.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(52), శివం దూబే(23)లు తమ స్టయిల్ మెరుపులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఆఖరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడడంతో 208కే టీమిండియా పరిమితమైంది. లేదంటే.. 220 పైగా స్కోర్ చేసేది.
ఆతిథ్య భారత జట్టు రెండో మ్యాచ్‌లో గొప్పగా రాణించడంతో భారీ స్కోర్ చసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(61) మెరుపులతో 7 ఓవర్లకే వంద కొట్టిన టీమిండియా.. అలవోకగా 230 ప్లస్ చేస్తుందనిపించింది. కానీ, మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన గెరాల్డ్ ఎరాస్మస్(4-20) పరుగుల వరదకు బ్రేకులు వేశాడు. ఓపెనర్ సంజూ శాంసన్(22) రెండో ఓవర్లోనే వెనుదిరిగాక.. గేర్ మార్చిన ఇషాన్ పూనకం వచ్చినట్టే ఆడాడు.
Innings Break!
On the back of a powerful batting show, #TeamIndia set a target of 2⃣1⃣0⃣ 🎯
Over to our bowlers 👉
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#T20WorldCup | #MenInBlue | #INDvNAM pic.twitter.com/uDOZ70cUvP
— BCCI (@BCCI) February 12, 2026
దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ పంపిన అతడు.. ఆరో ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. స్మిట్‌కు చుక్కలు చూపిస్తూ.. వరుసగా 6, 6, 6, 6 తో ఫిఫ్టీ సాధించాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ ఇషాన్, తిలక్ వర్మ(25) చెరొక ఫోర్ కొట్టగా స్కోర్ వంద దాటింది. ఎడాపెడా దంచేస్తున్న ఇషాన్‌ను ప్రత్యర్థి కెప్టెన్ ఎరాస్మస్ వెనక్కి పంపి బ్రేకులు వేశాడు. రెండు సిక్సర్లతో ప్రమాదకరంగా కనిపించిన సూర్యకుమార్ యాదవ్(12)ను ఔట్ చేయగా.. కాసేపటికే తిలక్ సైతం టైమింగ్ కుదరక ఔటయ్యాడు.
టాపార్డర్ బ్యాటర్లు వరుసగా ఔట్ కాగా.. 124కే నాలుగు వికెట్లు పడిన వేళ ఆర్దిక్ పాండ్యా(52), శివం దూబే(23)లు తొందరపడకుండా ఆడారు. చెత్త బంతుల్ని శిక్షించిన పాండ్యా. 18వ ఓవర్లో సిక్సర్‌తో మెగా టోర్నీలో తొలి అర్ధ శతకం సాధించాడు. మరోసారిబంతిని స్టాండ్స్‌లోకి పంపే క్రమంలో బౌండరీ వద్ద లీచె సూపర్ క్యాచ్‌తో పాండ్యా వెనుదిరిగాడు. దాంతో, ఐదో వికెట్‌కు 38 బంతుల్లోనే 81 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి బంతికి దూబే రనౌటవ్వగా.. చివరిబంతికి అక్షర్ పటేల్ (0) బౌల్డయ్యాడు. ఆఖరి ఓవర్లో రింకూ .. ఫలితంగా.. పత్యర్థికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.
Finishing touches, delivered 👊
Hardik Pandya with a Fiery knock of 52(28) 🔥
His 8⃣th half-century in T20Is 👏
Updates ▶️ https://t.co/SQLoaZjq98#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNAM | @hardikpandya7 pic.twitter.com/Ivts6ljGOg
— BCCI (@BCCI) February 12, 2026