M Rajalingam | ఆస్తులు పంచుకుని తండ్రిని నిర్లక్ష్యం చేసిన కుమార్తెలు.. ఆస్తులు తిరిగి ఇప్పించాలని ఆర్డీవోకు అర్జీ.. Video
M Rajalingam | తాను కన్నబిడ్డలు తన ఆస్తులు పంచుకుని, తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ 70 ఏళ్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బాగోగులు చూడనందుకు తన ఆస్తులను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన ఆర్డీవోకు అర్జీ పెట్టుకున్నారు.
సికింద్రాబాద్ : తాను కన్నబిడ్డలు తన ఆస్తులు పంచుకుని, తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ 70 ఏళ్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బాగోగులు చూడనందుకు తన ఆస్తులను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన ఆర్డీవోకు అర్జీ పెట్టుకున్నారు. తాను పంచి ఇచ్చిన ఆస్తులను తనకు తిరిగి ఇప్పించి, కుమార్తెల వేధింపుల నుంచి తనను రక్షించాలని కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎం రాజలింగం (70) కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మి ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా, రెండో కుమార్తె ఝాన్సీ మెడికల్ డిపార్టుమెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన భార్య మరణానంతరం ఆ ఇద్దరు బిడ్డలు తన ఆస్తులు పంచుకుని, తనను పట్టించుకోవడం లేదని రాజలింగం ఆరోపిస్తున్నారు.
ఇద్దరు కుమార్తెలకు తన 130 గజాల ఇంటి జాగాలో చెరో 65 గజాలు, తన భార్య 15 తులాల బంగారం చెరో ఏడున్నర తులాలు ఇచ్చానని రాజలింగం చెబుతున్నారు. పెద్ద కుమార్తె ఇంటిలో మూడు గదులు ఉన్నా తనను బాత్రూమ్ దగ్గర ఉన్న ఒక గదిలో బందీని చేశారని, మిగతా గదులకు తాళాలు వేసుకుంటారని ఆయన ఆరోపించారు.
రెండో కుమార్తె ఝాన్సీ ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా, తాను ఇచ్చిన ఆస్తిపై నెలకు రూ.22 వేల అద్దె వస్తున్నా తనకు కేవలం నెలకు రూ.1500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని రాజలింగం చెప్పారు. మూడో కుమార్తె ఉందని చెప్పిన రాజలింగం ఆమె గురించి వివరాలు వెల్లడించలేదు. తనను నిర్లక్ష్యం చేస్తూ వేదనకు గురిచేస్తున్న ఇద్దరు బిడ్డల నుంచి తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని ఆర్డీవోను కోరారు. తన పెద్దల్లుడు అప్పుల పేరుతో ఇంటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

