IND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్(61) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆకాశమే హద్దుగా నమీబియా బౌలర్లపై చెలరేగిన ఈ ఓపెనర్ మెరుపు అర్ధశతకం సాధించాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో వరుసగా.. 6, 6, 6, 6, 4తో ఊచకోతకు తెగబడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ విధ్వంసతో 6 ఓవర్లకే 86 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాతి ఓవర్లోనే వందకు చేరింది.
భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ తానెంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు. గురువారం రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియా బౌలర్లను బెంబేలెత్తించి 20 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. ఓపెనర్ సంజూ శాంసన్(22) రెండో ఓవర్లోనే వెనుదిరిగాక.. గేర్ మార్చిని ఇషాన్ పూనకం వచ్చినట్టే ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ పంపిన అతడు.. ఆరో ఓవర్లో మరింత రెచ్చిపోయాడు.
A blistering knock! 🔥
Ishan Kishan got to his half-century in style en route to 6️⃣1️⃣(24) 💪
Updates ▶️ https://t.co/SQLoaZjq98#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNAM | @ishankishan51 pic.twitter.com/H2mLWp1SQD
— BCCI (@BCCI) February 12, 2026
స్మిట్‌కు చుక్కలు చూపిస్తూ.. వరుసగా 6, 6, 6, 6 తో ఫిఫ్టీ సాధించాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ ఇషాన్, తిలక్ వర్మ(23 నాటౌట్) చెరొక ఫోర్ కొట్టగా స్కోర్ వంద దాటింది. ఎడాపెడా దంచేస్తున్న ఇషాన్‌ను ప్రత్యర్థి కెప్టెన్ ఎరాస్మస్ వెనక్కి పంపి బ్రేకులు వేశాడు. ప్రస్తుతం తిలక్ జతగా సూర్యకుమార్ యాదవ్(12 నాటౌట్) ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 120-2.