TG ICET 2026 | టీజీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల..ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్'- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిటీలోని వీసీ చాంబర్లో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
- ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- నల్లగొండ ఎంజీయూలో నోటిఫికేషన్ విడుదల చేసిన వీసీ హుస్సేన్, రిజిస్ట్రార్, కన్వీనర్ అల్వాల రవి
రామగిరి, ఫిబ్రవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్’- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిటీలోని వీసీ చాంబర్లో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.inలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..
అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసెట్ కో కన్వీనర్లు మిర్యాల రమేశ్‌కుమార్, సురేశ్‌రెడ్డి, యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీలక్ష్మి, సరిత, లక్ష్మీప్రభ, ప్రవళిక, మారం వెంకటరమణారెడ్డి, సబీనా హెరాల్డ్, శ్వేత, పీహెచ్ డీ స్కాలర్ రమేశ్ నాయక్ పాల్గొన్నారు.
టీజీ ఐసెట్ – 2026 ముఖ్యమైన తేదీలు
- టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ ఈ నెల12 నుంచి మార్చి 16 వరకు
- ఆలస్య రుసుము రూ. 250తో మార్చి 30, రూ.500తో ఏప్రిల్ 7, రూ.5 వేలతో మే1, రూ.10 వేలతో మే 3లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు
- దరఖాస్తుల సవరణకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు అవకాశం
- మే 4 నుంచి ఐసెట్ హాల్ టికెట్లడౌన్ లోడ్
- పరీక్షలు నిర్వహించే తేదీలు మే 13, 14
- పరీక్షల ప్రాథమిక కీ మే 29 కీపై అభ్యంతరాల స్వీకరణ మే 30 నుంచి జూన 5వరకు
- జూన్ 19న ఫైనల్ కీ, ఫలితాలు విడుదల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

