T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. చిన్న జట్టు ఇటలీ (Italy) అరంగేట్రంలోనే ‘మాతో జాగ్రత్త’ అనే హెచ్చరికలు పంపుతూ.. బోణీ కొట్టింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్(Nepal)ను గడగడ వణికిస్తూ జయభేరి మోగించింది. ఓపెనర్ల విధ్వంసంతో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసి.. ‘మేము చెలరేగితే ఇలా ఉంటది’ అని చాటింది. ఊహించని ఓటమితో నేపాల్ షాక్‌లో కూరుకుపోయింది.
సంచలనాలకు నెలవైన టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ చరిత్ర లిఖించింది. అనామక జట్టుగా మెగాటోర్నీలో అడుగుపెట్టి.. తొలి విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇటలీ.. గ్రూప్ సీలోని నేపాల్‌కు చెక్ పెట్టింది. మొదట కృష్ణన్ కలుగమగే(3-18), బెన్ మనేటి (2-9)లవిజృంభణతో ప్రత్యర్థిని 123కే ఆలౌట్ చేసిన యూరోపియన్ జట్టు.. ఛేదనలోనూ రఫ్ఫాడించింది.
A partnership that will go down in Italian cricket history!
124* by Anthony Mosca and Justin Mosca is the highest partnership between siblings in all T20Is ✨ pic.twitter.com/RZicDfVsXU
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2026
లక్ష్యం చిన్నది కావడంతో.. ఓపెనర్లు జస్టిన్ మొస్కా(60 నాటౌట్), ఆంథోని మొస్కా (62 నాటౌట్)లు విరుచుకుపడ్డారు. నేపాల్ బౌలర్లకు దడ పుట్టించిన ఈ సోదరులు బౌండరీలతో చెలరేగగా.. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. తద్వారా పొట్టి వరల్డ్‌కప్‌లో అత్యధిక భాగస్వామ్యం (124 నాటౌట్) నెలకొల్పిన సోదర ద్వయంగా వీరు గుర్తింపు సాధించారు.
నిరుడు వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విజయంతో వార్తల్లో నిలిచిన నేపాల్ ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు షాకిస్తుందనుకుంటే సీన్ రివర్సైంది. డేంజరస్ రోహిత్ పౌడెల్(23), దీపేంద్ర సింగ్ ఐరీ(17), గుల్సన్ జా(3)లను ఔట్ చేసి నేపాల్‌ను తక్కువకే కట్టడి చేసిన కలుగమగె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Top stuff from offie Ben Manenti & leggie Crishan Kalugamage as Nepal get bundled out for 1️⃣2️⃣3️⃣
Who’s winning this?
LIVE: https://t.co/xs7uSprCSE pic.twitter.com/D61t6nsG2e
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2026