Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు.. ఊరి పేరు మార్చేశారు.. కోనాయిపల్లికి బదులు కోనాపూర్!
Smart Ration Cards | కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో గ్రామం పేరును కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని ప్రింట్ చేశారు.
Smart Ration Cards | దౌల్తాబాద్, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో ఏకంగా గ్రామం పేరే తప్పుగా ముద్రించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టగా.. పలువురు కార్డుల్లో కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని నమోదైంది.
ప్రభుత్వ పథకాలకు కీలకమైన రేషన్ కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుల ముద్రణ, పంపిణీకి ముందే లబ్ధిదారుల వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా.. కనీసం గ్రామం పేరు కూడా సరిగ్గా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తప్పులున్న రేషన్ కార్డులను ఉపయోగించే సమయంలో భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేర్లు, చిరునామా, గ్రామం వంటి వివరాలను సరిచూసిన తర్వాతే కార్డులను పంపిణీ చేయాల్సిందని పేర్కొన్నారు.
ఈ విషయంపై సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కోనాయిపల్లి గ్రామానికి బదులుగా కోనాపూర్గా నమోదైన కార్డుల వివరాలను వెంటనే సరిచేసి లబ్ధిదారులకు సరైన కార్డులు అందించాలని కోరారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లోని వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పంపిణీ చేయాలని సూచించారు. తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

