Jitan Ram Manjhi: ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు మరింత సమయం ఇవ్వండి.. లోక్సభ స్పీకర్ను కోరిన జితన్ రామ్ మాంజీ
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి, ఎన్డీఏ కూటమి సభ్యుడు జితన్ రామ్ మాంజీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంట్లో కీలక బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ఎంపీలు మాట్లాడేందుకు మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ఆయన తన లేఖలో కోరారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఎన్డీఏ కూటమి సభ్యుడు జితన్ రామ్ మాంజీ(Jitan Ram Manjhi) లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంట్లో కీలక బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ఎంపీలు మాట్లాడేందుకు.. వారికి మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ఢిల్లీలోని తమ నివాసంలో ఎన్డీఏ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్కు చెందిన జేపీపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు మాంజీ తన లేఖలో తెలిపారు.
తమ వర్గానికి చెందిన అంశాలను ప్రస్తావించేందుకు ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు తగినంగా సమయాన్ని కేటాయించాలని పటేల్ కోరినట్లు మంత్రి మాంజీ తన లేఖలో చెప్పారు. ఎంపీ పటేల్ చేసిన అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన స్పీకర్ను కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సభలో మాట్లాడేందుకే కేటాయించిన సమయాన్ని మరింత పెంచాలని కోరుతున్నట్లు ఎంపీ పటేల్ ఓ మీడియాతో పేర్కొన్నారు. తమకు సమయం ఇవ్వడం లేదన్న అంశం కాదు అని, కానీ ఎక్కువ సమయం కావాలని, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన సమస్యలను సభలో మరిన్ని చర్చించాలని పటేల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

