నగోయా: ఏషియన్ గేమ్స్(Asian Games) మహిళల కబడ్డీ ఈవెంట్లో భారత జట్టుకు స్వర్ణ పతకం దక్కింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళలు దుమ్మురేపారు. తాజా గేమ్స్‌లో ఇండియాకు ఇది మూడో గోల్డ్ మెడల్ కాగా, ఏషియన్ గేమ్స్‌లో నాలుగోసారి భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. టోకాయి సిజిటన్ జిమ్నాజియంలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఇరాన్ తీవ్ర పోటీ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన తుదిఫైట్లో భారత మహిళల జట్టు 37-34 పాయింట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి నిమిషం వరకు ఇరాన్ తన పోరాట పటిమను ప్రదర్శించింది. చివరకు కబడ్డీ ఫైనల్లో ఇండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నది. ఏషియన్ గేమ్స్‌లో ఇండియన్ మహిళల జట్టు అయిదు సార్లు ఫైనల్స్ లో ప్రవేశించగా, నాలుగు సార్లు స్వర్ణ పతకం గెలుచుకున్నది.
The absolute Queens of Kabaddi retain their golden throne!
A flawless campaign ends in ultimate glory as the Indian Women’s Kabaddi Team clinches the GOLD MEDAL at the Asian Games 2026! 🇮🇳🏆
5 Finals. 4 Golds. The gold standard of Kabaddi belongs to India today, tomorrow, and… pic.twitter.com/90zjDjOpfI
— Anil Bansal (@dilseanilbansal) September 26, 2026
ఫస్ట్ హాఫ్ టైంలో ఇండియా 22-16 స్కోరుతో ఆధిక్యాన్ని చాటింది. కానీ సెకండ్ హాఫ్‌లో ఇరాన్ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. సెకండ్ హాఫ్‌లో 18-15 స్కోరుతో ఇరాన్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా.. ఫస్ట్ హాఫ్ లీడ్ వల్ల భారత్‌కు విజయం ఈజీ అయ్యింది. మ్యాచ్ గెలిచిన తర్వాత భారత మహిళల బృందం విక్టరీ ల్యాప్ నిర్వహించింది. జాతీయ గీతం వందేమాతరాన్ని ఆలపించారు. జాతీయ జెండాతో భారత ప్లేయర్లు కోర్టులో పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు మహిళల కబడ్డీలో స్వర్ణ పతకం దక్కింది. కేవలం 2018లో మాత్రం భారత జట్టు సిల్వర్ మెడల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.