ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అనుకూల వారం. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వారాంతంలో పరిస్థితులు మరింత సానుకూలం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రెట్టింపు శ్రమ అవసరం. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. సూర్యారాధన శుభ్రదం.
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పురాణ ప్రవచనాలకు హాజరవుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరుతాయి. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కావలసిన దుస్తులు, వస్తువులు కొనడంలో ఆలస్యం జరుగుతుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సాయపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోటివారితో మనస్పర్థలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు రావచ్చు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. భూ లావాదేవీల్లో కాలయాపన ఉండవచ్చు. శివాలయాన్ని సందర్శించండి.
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో మెలగడం అవసరం. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in