హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా నిర్మాణాలు కూల్చివేసి కోర్టు ధికరణకు పాల్పడినందున కోస్గి అప్పటి మున్సిపల్ కమిషనర్ సీ శశిధర్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అప్పీలు నిమిత్తం శిక్ష అమలు ను నాలుగు వారాలపాటు నిలిపివేసింది. నారాయణపేట జిల్లా కోస్గిలో ఆర్ మురళీధర్‌కు చెందిన 198 చదరపు గజాల్లో పంచాయతీ అనుమతులతో ఐస్‌క్రీమ్ పార్లర్, ఆన్‌లైన కేంద్రం, స్టోర్ రూమ్ నిర్వహిస్తున్నారు.
ఈ కేంద్రాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిసి 2019లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. అయినప్పటికీ 2024లో ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో అప్పటి కోస్గి మున్సిపల్ కమిషనర్ శశిధర్‌తోపాటు తహసీల్దార్‌పై మురళీధర్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. కోర్టు ఉత్తర్వులుఉన్నప్పుడు కూల్చివేత సరికాదన్నారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కోర్టు ధికరణకు పాల్పడినందున నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.