హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంపై నమ్మకంతో ‘చలో హైదరాబాద్’ను వాయిదా వే సిన ఉద్యోగుల విశ్వాసాన్ని దె బ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 14 లేదా 15 తేదీల్లో పీఆర్సీ నివేదిక తెప్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ నివేదిక ఎందుకు రాలేదో ప్రభుత్వం ఉద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు.
నివేదిక విషయంలో జాప్యం ఉద్యోగుల్లో అనేక అ నుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నెల 18న ప్రభుత్వం నిర్వహించనున్న చర్చల ద్వారా తమ సమస్యలకు పరిషారం లభిస్తుందనుకు న్న తరుణంలో చర్చలు వాయిదా వేయ డం ఉద్యోగుల్లో నిరాశ కలిగించిందని తెలిపారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవడంలో చర్చలు ఎందుకు వాయి దా వేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యో గ సంఘాలు ఉద్యమాన్ని వాయిదా వేస్తే, ప్రభుత్వం చర్చలను వాయిదా వేయ డం సరికాదని పేర్కొన్నారు.