హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేదర్పై అనుచిత వ్యాఖ్యలతో ‘కల్పిత నాయకుడు’ (ఫ్యాబ్రికేటెడ్ లీడర్) పుస్తక రచయిత వరప్రసాద్ అలియాస్ హమారాప్రసాద్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినందున పుస్తకావిషరణ జరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. అంబేదర్పై ఆరోపణలతో ప్రచురితమైన పుస్తకావిష్కరణను నిలిపివేయాలని, రచయితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ ఏ జ్ఞానచంద్రన్మౌలి గురువారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పుస్తకాల విక్రయం జరిగితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే పుస్తకాల విక్రయం కోసం ఆన్లైన్ వేదికలను ఎంచుకున్నారని తెలిపారు. ప్రభు త్వ తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్న న్యాయమూర్తి పిటిషన్పై విచారణను మూసివేశారు.