టీపీసీసీ చీఫ్‌పై హరీశ్‌రావు పరువు నష్టం దావా!
క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు న్యాయపోరాటానికి దిగారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శాసనమండలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేశారు.
- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై కూడా కేసు
- క్షుద్రపూజలంటూ నిరాధార ఆరోపణలపై న్యాయపోరాటం
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు న్యాయపోరాటానికి దిగారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శాసనమండలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేశారు. హరీశ్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు కోర్టులో రెండు వేర్వేరు ప్రైవేట్ ఫిర్యాదులను నమోదు చేశారు.
అనంతరం న్యాయవాదులు నాంపల్లి కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే హరీశ్‌రావు ఇమేజ్ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో క్షుద్ర పూజలంటూ దిగజారుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆ ఇద్దరు నేతలు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, తమ అనుచిత వ్యాఖ్యల ను తక్షణమే వెనకి తీసుకోవాలని డి మాండ్ చేస్తూ ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపామని, సమాధానం ఇచ్చేందు కు తగినంత సమయం కూడా ఇ చ్చామని వివరించారు. ఆ నేతలు వ్యాఖ్యలను వెనుకకు తీసుకోపోగా, పంపిన ప్రత్యుత్తరంలో కనీసం క్షమాపణ కోరలేదని తెలిపారు.
అన్ని ఆధారాలు సమర్పించాం
కాంగ్రెస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలకు సంబంధించిన పూర్తి వీడియో క్లిప్పింగులు, పత్రికా ప్రకటనలు, లీగల్ నోటీసులు, సంబంధిత ఇతర డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలన్నింటినీ న్యాయస్థానానికి సమర్పించినట్టు లీగల్ టీమ్ పేరొంది. రాజకీయ విమర్శలను ఎదురోలేక వ్యక్తిగత జీవితంపైకి దిగజారి, ధార్మిక విశ్వాసాలను సైతం కించపరిచే విధంగా మాట్లాడే వారికి ఈ న్యాయపోరాటం ద్వారా చట్టపరమైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

