నమస్తే తెలంగాణ నెట్వర్క్ : గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను పది శాతానికి పెంచి వారి రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ లంబాడా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కొనియాడారు.
రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి గురువారం నాటికి సరిగ్గా నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. గిరిజనులు మిఠాయిలు పంచుకొన్నారు. గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ ప్రతిజ్ఞ చేశారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గౌరికుంటతండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మోత్కులకుంట తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గిరిజన మహిళలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూరయ్యబంజారా తండాలో కేసీఆర్ ఫ్లెక్సీలకు పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేస్తున్న తండా మహిళలు, గిరిజనులు. చిత్రంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం మ్యాడారం తండాలో కేసీఆర్ ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేస్తున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి. చిత్రంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, గిరిజనులు

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, గిరిజన నాయకులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు