MYTA | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో భాగంగా ఆయనను సత్కరించేందుకు శనివారం మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, స్థానిక భారతీయులతో స్వాగత సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు. ముఖ్యంగా మైటా ( మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారుల బతుకమ్మ, బోనాలు, లంబాడి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ.. తక్కువ సమయంలో కేటాయించిన 7 నిమిషాల నిడివి గల నృత్యప్రదర్శనను విజయవంతంగా కూర్చి ప్రదర్శించిన మైటా మహిళా సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైటా కోర్ కమిటీ సభ్యులతో పాటు మైటా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
The RajaSaab | ముఖం ప్రభాస్ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!
Anil Ravipudi | క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!
Siva karthikeyan | రేసింగ్ ట్రాక్‌పై కోలీవుడ్ స్టార్స్.. అజిత్‌ని కలిసిన శివకార్తికేయన్