With Love | టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘విత్ లవ్’ (With Love)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 6, 2026న విడుదలైన ఈ ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను చూసిన ఆయన, సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకుంటూ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇటీవలి కాలంలో వచ్చిన ఒక ఆహ్లాదకరమైన (Breezy), చక్కని రొమాంటిక్ కామెడీ ఇదని, ముఖ్యంగా తెలుగు డైలాగులు చాలా సందర్భోచితంగా, నీట్‌గా ఉన్నాయని ఆయన కొనియాడారు. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు, హీరో అభిషన్ జీవింత్, హీరోయిన్ అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని, వారి పెర్ఫార్మెన్స్ ఎంతో బాగుందని ప్రశంసించారు. అలాగే షాన్ రోల్డన్ అందించిన సంగీతం సినిమాకు అద్భుతంగా కుదిరిందని పేర్కొన్నారు.
డెబ్యూ డైరెక్టర్ మదన్ పనితీరును మెచ్చుకుంటూ, ఆయనకు దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్‌తో పాటు నిర్మాత సౌందర్య రజనీకాంత్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. గతంలో తాము ప్రేమించిన వ్యక్తులకు ప్రపోజ్ చేయలేకపోయిన ఇద్దరు వ్యక్తులు, మళ్ళీ వారిని కలిస్తే జరిగిన సంఘటనలు ఏంటి అనే కథతో ఈ సినిమా వచ్చింది.
Truly enjoyed watching #WithLove 🩶
A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.
Kudos to @madhann_n on a fantastic debut. Long way to…
— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026