BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
BRS Bahrain | తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని బీఆర్ఎస్ బహ్రెయిన్ ఎన్నారై శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్ ,ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అన్నారు.
బహ్రెయిన్ : తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ( KCR ) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని బీఆర్ఎస్ బహ్రెయిన్ (BRS Bahrain ) ఎన్నారై శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్ ( Sateesh Kumar ), ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అన్నారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ ( Deeksha Divas ) ను ఘనంగా నిర్వహించారు.
14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి 60 సంవత్సరాల కలను నిజం చేసిన ఆదర్శ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా సేవలందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపి, ప్రజలకు మెరుగైన సంక్షేమ ఫలాలను అందించారని పేర్కొన్నారు. కేసీఆర్ కారణంగానే రాష్ట్రం సిద్ధించి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్‌ను గౌరవించాల్సింది పోయి నిత్యం తిట్ల పురాణంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ తిరిగి సీఎం కావాలనే ఆకాంక్ష ప్రజల్లో నానాటికి బలపడుతూనే ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి, ఆశలు చూపించి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు ,420 హామీలు అమలు చేస్తామని అధికారం లోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు. మూడేళ్ళ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షులు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ , జనరల్ సెక్రటరీలు అన్నారం సుమన్ ,కార్యదర్శులు ఉత్కం కిరణ్ గౌడ్ ,సంగేపు దేవన్న , మల్లెల ప్రమోద్ , సంకోజీ రాణాప్రతాప్ , కస్తూరి కిరణ్ , కొసరి సతీష్ , సాయన్న , పానుగంటి సహదేవ్ ,మల్లెల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

