The RajaSaab | ముఖం ప్రభాస్ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!
The RajaSaab | ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన అనంతరం ప్రభాస్ బాడీ డబుల్ సీన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
The RajaSaab | ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన అనంతరం ప్రభాస్ బాడీ డబుల్ సీన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ ప్రతి సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హై-డెఫినిషన్ నాణ్యతలో సినిమాను చూస్తున్నప్పుడు, ప్రభాస్ నేరుగా నటించని కొన్ని కీలక సన్నివేశాలు బయటపడుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు డ్యాన్స్ మూమెంట్స్‌లో ప్రభాస్ స్థానంలో బాడీ డబుల్‌ను వాడి, అత్యాధునిక హెడ్ రీప్లేస్మెంట్ లేదా ఫేస్ స్వాప్ టెక్నాలజీతో ముఖాన్ని మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనికి తోడు సినిమాలోని కంటిన్యుటీ లోపాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. బస్సు సీన్లలో ఒక క్షణం గడ్డంతో ఉన్న హీరో, మరుసటి క్షణమే క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోవడం, అలాగే నడక శైలిలో తేడాలు ఉండటం వంటివి ఫ్యాన్స్‌ను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. థియేటర్ వెర్షన్లో లేని కొన్ని ‘ఓల్డ్ గెటప్’ సీన్లను ఓటీటీ కోసం ‘ఎక్స్టెండెడ్ కట్’ పేరుతో జోడించినప్పటికీ, వాటిలో కూడా నాణ్యత లోపాలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈ బాడీ డబుల్ వివాదంపై దర్శకుడు మారుతి స్పందిస్తూ, నేటి కాలంలో హీరోల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా డూప్స్ వాడటం సాధారణమే అని సమర్థించుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనితీరు ఇంత నాసిరకంగా ఉండటం పట్ల ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ విషయంలో మేకర్స్ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ హీరో ట్రోలింగ్‌కు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Prabhas took audience for granted. I’m sure fans can use AI and give better output than this masterpiece. I’m surprised why producers are wasting their money if their main actor isn’t giving dates. Can’t blame Maruti here. Same happened with OG.#RajaSaab #TheRajaSaab #Tollywood pic.twitter.com/o2DmdFeClX
— vikatakavi (@3vikatakavi) February 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

