Cambodia: డిజిటల్ స్కామ్ సెంటర్లపై కంబోడియా ఉక్కుపాదం.. ఇండియన్ జెండా, పోలీసు బ్యాడ్జీలు, గాంధీ బొమ్మ లభ్యం
Cambodia: డిజిటల్ స్కామ్ కేంద్రాలపై కంబోడియా దాడులు చేసింది. ఓ కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం, ఫేక్ పోలీసు, సీబీఐ లోగోలు, గాంధీ-అంబేద్కర్ చిత్రాలను గుర్తించారు. స్కామ్‌లకు సూత్రధారి అయిన చైనీస్ వ్యక్తితో పాటు 173 మందిని అరెస్టు చేశారు. 11 వేల మందిని డిపోర్ట్ చేశారు.
కంపోట్: ఆన్లైన్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఇటీవల కంబోడియా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి జరుగుతున్న ఏరివేతల్లో భాగంగా ఇటీవల సుమారు 200 డిజిటల్ స్కామ్ కేంద్రాలపై దాడి చేశారు. ఆన్లైన్ స్కామ్‌లకు పాల్పడుతూ.. డిజిటల్ అరెస్టుల ద్వారా బెదిరిస్తూ.. కోట్లు కోట్లు కొల్లకొడుతున్న కొన్ని కేంద్రాలపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపింది. అయితే ఓ సెంటర్లోకి వెళ్లిన స్థానిక పోలీసు అధికారులు.. అక్కడ ఉన్న సెటప్‌ను చూసి షాక్ అయ్యారు. భారతీయ త్రివర్ణ పతాకం, గాంధీ-అంబేద్కర్ బొమ్మ, భారతీయ పోలీసులకు చెందిన బ్యాడ్జీలు, లోగోలు, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు.
సుమారు 190 కేంద్రాలను తాజాగా మూసివేసినట్లు కంబోడియా సీనియర్ మంత్రి చాయ్ సినార్ది తెలిపారు. వియత్నాం బోర్డర్ సమీపంలోని కంపోట్ ప్రావిన్సులో ఉన్న ఓ కేంద్రాన్ని ఆయన ఇటీవల విజిట్ చేశారు. అయితే ఈ డిజిటల్ స్కామ్ సెంటర్ల నుంచి నేరాలకు పాల్పడుతున్న వారిలో 173 మంది అరెస్టు చేసినట్లు చెప్పారు. సుమారు 11 వేల మంది వర్కర్లను కూడా డిపోర్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ముంబై పోలీసు లోగో, సీబీఐ లోగో, గాంధీ.. అంబేద్కర్ బొమ్మలను వాడుకుని స్కామ్‌లకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
అయితే ఈ స్కామ్‌లో చైనీస్ వ్యక్తి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. చైనాలో పుట్టిన ఆ టైకూన్ .. ఈ వ్యవస్థను నడిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. చైనాకు చెందిన లీ కువాంగ్ అనే వ్యక్తి డిజిటల్ స్కామ్‌లకు సూత్రధారిగా భావిస్తున్నారు. ఆపరేషన్‌లో భాగంగా కంపోట్లో ఉన్న ఓ కేంద్రానికి రిపోర్టర్లను తీసుకెళ్లారు. వాటి వీడియోలను రిలీజ్ చేశారు. అక్కడ వర్క్ రూమ్‌లు చాలా విశాలంగా ఉన్నాయి. కంప్యూటర్ స్టేషన్లు, డెస్క్‌లు చాలా పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్ని ఎలా మోసం చేయాలన్న అంశాలపై డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తేల్చారు. ఫోన్ కాల్స్ కోసం స్టూడియో బూత్‌లు, భారతీయ నకిలీ పోలీసు స్టేషన్ కూడా ఆ సెంటర్లో ఉన్నాయి.
కంపోట్ క్యాసినో కాంప్లెక్స్ నుంచి ఎవర్ని అరెస్టు చేయలేదని అధికారులు చెబుతున్నారు. టైకూన్ లీ కువాంగ్‌ను అరెస్టు చేయడంతో అక్కడున్న వారు పారిపోయినట్లు చెప్పారు. పరారీ అయ్యేవారిని అరెస్టు చేసేంత సిబ్బంది తమ వద్ద లేరని కూడా మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో థాయ్‌ల్యాండ్ బలగాలు జరిపిన దాడి ప్రాంతాలను విజిట్ చేశారు. కంబోడియా భూభాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలపై థాయ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న కొన్ని స్కామ్ కేంద్రాల్లో వివిధ దేశాలకు చెందిన నకిలీ పోలీసు స్టేషన్లు ఉన్నట్లు గుర్తించారు.
This is an abandoned scam center in Cambodia used by scamsters for defrauding Indians by fake digital arrests. They put Indian flags, pictures of Gandhi and Ambedkar and CBI Logo to resemble it like CBI Office. No such thing as Digital Arrest exists in Lawpic.twitter.com/UvLLTKFR0U
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) February 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

