Crime news : ఒక విద్యార్థిపై ఐదారుగురు తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడిని కిందపడేసి ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దాడి చేసిన విద్యార్థులు అక్కడి నుంచి జారుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
దాడికి పాల్పడిన విద్యార్థులంతా గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ కాలేజీకి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా విద్యార్థిపై సాటి విద్యార్థులు ఘోరంగా దాడికి పాల్పడిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
ఏపీలో విద్యార్థిని దారుణంగా కొట్టిన తోటి విద్యార్థులు
కాళ్లతో తన్నుతూ, ఇనుప రాడ్లతో బలంగా కొడుతూ వీడియో తీసిన విద్యార్థులు
గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా సమాచారం
దాడిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థి
ఘటనకు… pic.twitter.com/qRJdfVdkJ3
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026