Gandra Venkataraman Reddy | జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, డాక్టర్ల సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోగులకు శాపంగా పెద్దాసుపత్రి మారిందన్నారు. ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా ఆసుపత్రి తీరున్నదని ఫైర్ అయ్యారు.
ఇటీవలే ప్రారంభించిన ఎమ్మారై స్కాన్ నిత్యం మూతబడి ఉండటమేంటి..? అని అధికారులను ప్రశ్నించారు. ఎమ్మారై స్కాన్ పరిస్థితి చూసి పేదల గుండెలు బరువెక్కి పోతున్నాయి. అధ్వానంగా మరుగుదొడ్ల పరిశుభ్రత ఆక్సిజన్ ప్లాంట్ సమస్య వెంటనే పరిష్కరించాలి. త్రాగునీరు లేక రోగులు అల్లాడిపోతున్నారన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో కండోమ్స్ దర్శనమివ్వడంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.