Nirmal Purja | ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి
Nirmal Purja | ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్ పుర్జ (Nirmal Purja) మృతిచెందారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని బ్రాడ్ పీక్ (Broad Peak) పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం (Avalanche) కారణంగా ఆయన మరణించినట్లు ఎలైట్ ఎక్స్‌పెడిషన్ సంస్థ ధ్రువీకరించింది.
Nirmal Purja : ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్ పుర్జ (Nirmal Purja) మృతిచెందారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని బ్రాడ్ పీక్ (Broad Peak) పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం (Avalanche) కారణంగా ఆయన మరణించినట్లు ఎలైట్ ఎక్స్‌పెడిషన్ సంస్థ ధ్రువీకరించింది. పుర్జా నేతృత్వంలో వెళ్లిన పది మంది పర్వతారోహకులు ఈ ప్రమాదంలో గల్లంతు కాగా.. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు.
నేపాల్‌లో జన్మించిన నిర్మల్ పుర్జా.. బ్రిటన్ గుర్ఖా బ్రిగేడ్‌లో మాజీ సభ్యుడిగా పనిచేశారు. పర్వతారోహణపై ఆసక్తి ఉన్న ఆయన ఎన్నో సాహసోపేత యాత్రలను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల మీటర్ల ఎత్తయినా 14 పర్వతాలను ఏడు నెలల్లోపే అధిరోహించి 2019 లో చరిత్ర సృష్టించారు. అనంతరం 2021 శీతాకాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి ఘనత సాధించిన బృందంలోనూ పుర్జా ఒకరు. పుర్జా సాహసాలపై ‘14 పీక్స్ : నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లోనూ డాక్యుమెంటరీ వచ్చింది.
కారాకోరం పర్వతశ్రేణుల్లో ఒకటైన బ్రాడ్ పీక్ 8051 మీటర్లతో ప్రపంచంలో 12వ ఎత్తయిన పర్వతంగా గుర్తింపు పొందింది. అత్యంత సవాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు పుర్జా నేతృత్వంలో పదిమంది యాత్రికుల బృందం బయలుదేరింది. ఏడు వేల అడుగుల ఎత్తులో ఉండగా భారీ హిమపాతం తాకడంతో వీరంతా గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు నేపాల్ వాసులు కాగా.. పాకిస్థాన్, ఒమన్, అమెరికా, చైనాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

