Apple iOS 26.2 : యాపిల్ యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఓఎస్ అప్డేట్ వచ్చేసింది. ఐఓఎస్ 26.2 అప్డేట్ ఇప్పుడు అందరు ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే, ఐఫోన్ 11, ఆ తర్వాత వచ్చిన మోడళ్లకు మాత్రమే ఈ అప్డేట్ ఉంటుందని యాపిల్ కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఐఓఎస్ ప్రధానంగా బగ్స్‌ను తొలగించి, స్టెబిలిటీ మీద దృష్టి పెట్టింది.
ఈ ఐఓఎస్ ద్వారా యూజర్లకు డాటా, ప్రైవసీకి సంబంధించి మరింత సేఫ్టీ దొరుకుతుంది. కొన్ని కొత్త ఫీచర్లతోపాటు, పెర్ఫామెన్స్ పరంగానూ మరింత మెరుగ్గా ఉంటుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ పెరుగుతుంది. ర్యాండమ్ యాప్ క్రాషెస్ కూడా తగ్గుతాయి. స్మూత్ యానిమేషన్స్, ఫాస్టర్ యాప్ లాంచెస్ కూడా ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నట్లు యూజర్లు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే కొత్త గ్యాడ్జెట్లకు కంపాటిబిలిటీ ఉండేలా ఈ ఐఓఎస్ ఉంటుంది. మీరూ ఐఓఎస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా బ్యాటరీ 50 శాతం పైగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వై-ఫై కనెక్ట్ చేసుకోవాలి. ఐఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, జనరల్ సెక్షన్ ఎంచుకోవాలి. అందులోనే సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఐఫోన్ అప్డేట్ అని కనిపిస్తుంది.
వెంటనే డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయాలి. అలాగే టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి యాక్సెప్ట్ చేయాలి. అంతే.. కొత్త ఐఓఎస్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇదంత పూర్తయ్యేటప్పుడు ఒకటి కంటే ఎక్కువసార్లు ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో పవర్ ఆఫ్ చేయకూడదు. ఒకసారి ఐఓఎస్ ఇన్స్టాలేషన్ పూర్తైతే ఇక మీ ఐఫోన్‌ను మరింత కొత్తగా వాడుకోవచ్చు.