న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆశాజనక పనితీరు కనబరిచింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.593 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.370.88 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి నమోదైంది.
వంటనూనెల విభాగం అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది మూడో త్రైమాసికంలో రూ.9,020 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారికిగాను రూ.10,541.12 కోట్లకు ఎగబాకింది.