Arjun Sarja | మల్టీ టాలెంటెడ్ యాక్టర్, యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్షన్లో వస్తున్న చిత్రం సీతా పయనం (Seetha Payanam). కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తుండగా..అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది . ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అర్జున్.
తాను గతంలో ప్రతీ సినిమాను రెండు, మూడు భాషల్లోనే రిలీజ్ చేశానని.. యూనివర్సల్ కాన్సెప్ట్ అవడంతో ఈ సినిమా నాలుగు భాషల్లో రాబోతుందన్నాడు. భాష పరిధిని దాటి సాగే ఫీల్ గుడ్ సబ్జెక్ట్ ఇది. సినిమాలోని భావోద్వేగాలు చాలా అనుబంధంగా ఉంటాయి. అందుకే మేము ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా విడుదల చేయాలని అనుకున్నాం. తెలుగు సినిమాల ద్వారా తన కూతురును పరిచయం చేస్తుండటంపై అర్జున్ స్పందిస్తూ.. దశాబ్ధాలుగా తనపై తెలుగు ప్రజలు చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్‌కు నివాళిగా కూతురుని పరిచయం చేస్తున్నట్టు అభివర్ణించాడు.
సీతాపయనం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని, రిలేషన్షిప్స్, కుటుంబ సంబంధాలు, కుటుంబ విలువలతో భావోద్వేగపూరితంగా, స్టోరీలైన్‌లో భాగంగా వచ్చే యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమా అన్నాడు. ఈ స్టోరీ పూర్తి స్థాయి స్క్రిప్టులా రెడీ చేసేటప్పటికి 13 ఏండ్లు పట్టిందని.. ఇది వ్యక్తిగతంగా నా హృదయానికి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ అని అన్నాడు.
మళ్లీ సెట్ అయితే కలిసి పనిచేస్తాం..
ముందుగా నేను కథ రెడీ చేసుకున్నా.. ఆ తర్వాత విశ్వక్ సేన్‌ను అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టు జరుగవు. విశ్వక్సేన్తో సమస్యలేమి లేవు. కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదని.. ఆ స్థానంలోకి నిరంజన్ వచ్చాడని చెప్పాడు అర్జున్. లైఫ్ ఒక సర్కిల్ లాంటిదని,, కక్ష్య సాధింపులేమి ఉండవన్న అర్జున్.. మళ్లీ సెట్ అయితే విశ్వక్సేన్, తాను కలిసి పనిచేస్తామన్నాడు.
సీతాపయనం సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకుందని.. సినిమాలో ఉన్న ఎమోషనల్ డెప్త్ కారణంగా ఎలాంటి కట్స్ లేకుండా సర్టిపికెట్ జారీ చేశారన్నాడు. సినిమాలోని ప్రతీ పాత్రకు ఒక ఉద్దేశం, భావోద్వేగ ప్రయాణం ఉంటుందని.. ప్రేక్షకులు ప్రత్యేకించి తండ్రీకూతుళ్ల రిలేషన్‌షిప్‌కు బాగా కనెక్ట్ అవుతారని చెప్పాడు. సీతాపయనం కుటుంబకథాచిత్రమని.. జెన్ జెడ్ నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చాడు.
Rajpal Yadav | రాజ్‌పాల్ యాదవ్‌కు లభించని ఊరట.. బెయిల్‌పై విచారణ వాయిదా